సీఎం జగన్‌ కు “ఓటీటీకి ఓటీపీకి” తేడానే తేలిదు : నారా లోకేష్‌ సెటైర్లు

-

సీఎం జగన్‌ కు ఓటీపీకి.. ఓటీటీ కి పెద్దగా తేడాగా తేలిదని నారా లోకేష్‌ సెటైర్లు పేల్చారు. బాబాయ్ హత్య పై జగన్ ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు చంపిన వాళ్ళు ను కనిపెట్టడం లేదని నిలదీశారు. ఎందుకంటే వాళ్ళే సూత్రధారులు కాబట్టి…అందుకే జగన్‌ సైలెంట్‌ అయ్యాడని ఆరోపణలు చేశారు. సీబీఐ పై పోలీసులు కేసులు పెట్టడం ఫస్ట్ టైం చూస్తున్నానని ఆగ్రహించారు.

హత్య వెనుక ఎవరున్నారో సునీతా రెడ్డి చెప్పారని… 2019లో చంద్రబాబు చంపారు అన్న జగన్ అధికారం లో వచ్చాక ఎందుకు సీబీఐ విచారణ కోరలేదని నిప్పులు చెరిగారు. అవినాష్ రెడ్డి గుండె పోటు అని చెప్పి ఇప్పుడు రోడ్ల పై తిరుగుతున్నారని మండి పడ్డారు. భీమ్లా నాయక్ సినిమా నాకు నచ్చింది అందుకే ట్విట్ చేశానని.. అన్ని సినిమాలు నచ్చాలని లేదన్నారు.

ఎవరి పై ట్వీట్ పెట్టాలో వాళ్ళు చెప్పాలా ? 5.4 లక్షల ఉద్యోగాలు కల్పన చంద్రబాబు హయాంలో వచ్చాయని అని గౌతం రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. ఎపి అప్పుల్లో మునిగిపోయింది..ఇలాగే పోతే ప్రజలపై పన్నులు భారం పెరుగుతుందని వెల్లడించారు. ఇప్పటికే అన్ని తాకట్టు పెట్టారు..ఇంకా రోడ్లు మిగిలాయి వాటిని తాకట్టు పెడతారు..బ్యాంక్ లు టోల్స్ ఎర్పాటు చేస్తాయన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు చేసే అర్హత జగన్మోహనరెడ్డి కి లేదని.. కేంద్రం బౌండరీలు మార్చవద్దని చెప్పినా హడవుడిగా జిల్లాల విభజన చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news