‘అమ్మ ఒడి’లో కోతలు..అమ్మల క్షోభ తగులుతుందని లోకేష్‌ ఫైర్‌

-

జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌.. ఏపీలో అమ్మ ఒడి పథకాన్ని ఎంతో ప్రతి ష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఈ పథకంపై కొన్ని ఆంక్షలు విధించింది జగన్‌ సర్కార్‌. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఫైర్‌ అయ్యారు. కన్న తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టు ఉంది సీఎం జగన్ అమ్మ ఒడి పధకం తీరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తేదీల మతలబుతో ఒక ఏడాది ఎగ్గొట్టి, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.1000 కోత పెట్టి అర్ద ఒడిగా మారిన పథకంపై ఇప్పుడు ఆంక్షల కత్తి ఎక్కుపెట్టి పథకం మనుగడనే ప్రశ్నార్ధకంగా మార్చేసారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. 300 యూనిట్లు దాటి కరెంట్ వాడితే పథకం కట్ అంటూ కొత్త నిబంధన పెట్టారన్నారు.

ప్రతి విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరి, ఆధార్‍లో కొత్త జిల్లాలను నమోదు చేసుకోవాలి, కొత్త బియ్యం కార్డు ఉంటేనే అమ్మఒడి లాంటి కండిషన్స్ అప్ప్లై అని ముందే ఎందుకు చెప్పలేదని మండిపడ్డారు. జగన్ మోసపు రెడ్డి గారు? మీ సతీమణి గారు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు వేస్తామని ఇచ్చిన హామీని కూడా గంగలో కలిపేసారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. అమ్మలని మానసిక క్షోభకి గురిచేసే ఈ ఆంక్షలు తీసేసి అర్హులందరికీ అమ్మ ఒడి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news