చంద్రబాబు స్టేట్ కమిటీలు కూడా ప్రకటించేశారు! ప్రస్తుతం టీడీపీలో ఉన్న ప్రతీ నాయకుడికి ఒక పదవైతే దొరికింది. కాకపోతే అవి పార్టీ పదవులు కాబట్టి ఆ ఉత్సాహం అంతగా నేతల్లో కనిపించలేదు! ఎవరూ చంద్రబాబుకి కృతజ్ఞతలు చెప్పిన దాఖళాలు లేవు! సరే అది లైట్ తీసుకున్నా.. ఇప్పుడు ఆ కమిటీలలోని పెద్దలు ఎంతమంది ఆయా బాధ్యతల్లో ఇమిడిపోగలరు అన్నది పెద్ద ప్రశ్న!
ఇప్పుడు టీడీపీకి కావాల్సింది ఆత్మస్తుతి పరనింద మాత్రమే కాదు! పార్టీకి పూర్వవైభవం రావాలంటే ఏమి చేయాలనే ఆలోచనలు చేయడం! అచ్చెన్న ఒక దిక్కుకి, లోకేష్ మరో దిక్కుకి వెళ్లడం.. చంద్రబాబు మాత్రం రూము కి జూము కి మాత్రమే పరిమితమవ్వడం వల్ల ఉపయోగం లేదు! ఎన్ని కమిటీలు వేసినా వారిలో ఎంత మందికి పదవులు ఇచ్చినా ఒరిగేది ఏమీ లేదు!
ఈ పరిస్థితుల్లో కనీసం ఈ పదవుల పేరు చెప్పుకుని అయినా.. ఈ కమిటీల్లో పదవులు పొందినవారంతా ఏకతాటిపైకి వచ్చి.. కాస్త్ర గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకుంటూ పని చేసుకుంటూపోతే ప్రయోజనం ఉంటుంది! మరి ఈ విషయంలో టీడీపీ నేతలకు ఆ ఉత్సాహాన్ని ఇచ్చేది ఎవరు? వారిలో ధైర్యాన్ని నింపి కలుపుకుపోవాల్సింది ఎవరు? చంద్రబాబా అచ్చెన్నా లేక లోకేష్ బాబా?
కేవలం కమిటీలు పదవులు మాత్రమే కేడర్ లో నమ్మకాన్ని, నాయకుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తాయని బాబు భ్రమ పడితే చేయగలిగేది ఏమీ లేదు కానీ… కాస్త బాబు కూడా జూం మీటింగుల్లో జగన్ పై చేసిన విమర్శలే చేయడం మాని.. కేడర్ లో ఉత్సాహం నమ్మకం కలిగే మాటలు చెబుతూ.. తనదైన రాజకీయ దర్శకత్వ టాలెంట్ తో ముందుకు తీసుకుని వెళ్లాలని కోరుకుంటున్నారు టీడీపీ అభిమానులు!