ఆంధ్రప్రదేశ్… జగన్ తాత రాజారెడ్డి జాగీరా! – నారా లోకేష్‌ సంచలనం

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాల నిర్మాణంపై మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. వివిధ జిల్లాల్లోని వైసీపీ కార్యాలయ భవనాల ఫొటోలను ట్వీట్ చేసిన లోకేష్….ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్ తాత రాజారెడ్డి జాగీరా! అంటూ నిప్పులు చెరిగారు. వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా భూములను కేటాయించుకున్నారని మండిపడ్డారు మంత్రి నారా లోకేష్.

YCP chief Jagan’s meeting with party MLCs ended

వెయ్యి రూపాయల నామ మాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నారని నిప్పులు చెరిగారు. జనం నుంచి దోచుకున్న రూ. 500 కోట్లతో ప్యాలెస్‌లు కడుతున్నారని ఆగ్రహించారు. జగన్ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన రూ. 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు అంటూ సంచలన పోస్ట్‌ పెట్టారు మంత్రి నారా లోకేష్. జగన్ విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే రూ. 500 కోట్లతో 25వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చు అన్నారు. ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి? జగన్ ధనదాహానికి అంతు లేదా ? అని నిలదీశారు మంత్రి నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news