అన్నా క్యాంటీన్లకు దాతలు సహకారం అవసరం..!

-

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు.. ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో 2 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. డొక్కా సీతమ్మ నాడు ప్రతి ఒక్కరి కడుపు నింపారు. టీటీడీలో ఉచిత అన్నదాన ట్రస్టు ఏర్పాటు చేసింది ఎన్టీఆర్. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా నేటికీ చాలా మంది పేదలు మూడు పూటలా భోజనం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. పేదల ఆకలి తీర్చడానికే అన్నా క్యాంటీన్ లు నాడు ఏర్పాటు చేశాం. అన్నా క్యాంటీన్లలో మూడు పూటల నాణ్యమైన భోజనాన్ని అందించాం.

కానీ గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసేసింది. మా పార్టీ నేతలు స్వచ్ఛందంగా మొబైల్ అన్నా క్యాంటీన్లు నిర్వహించాం. ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్ లు ప్రారంభించాం. భవిష్యత్ లో మండల కేంద్రాలు, గిరిజన ప్రాంతాల్లోనూ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. ఇలాంటి మంచి కార్యక్రమానికి దాతలు సహకారం అవసరం అని పేర్కొన అచ్చెన్నాయుడు.. హరే రామ.. హరే కృష్ణ.. సంస్థ సెంట్రలైజ్డ్ కిచెన్ నుంచి మంచి ఆహారం అందిస్తున్నాము అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news