టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టానికి ఎవరూ చుట్టాలు కాదని.. సుబ్రమణ్యం కేసులో విచారణ జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రభుత్వం నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ అనంత బాబు పెళ్లి కి వెళ్లి వచ్చారు అని ఎల్లో మీడియాలో చూశానని.. తప్పు చేయలేదనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో తిరిగి ఉండవచ్చని బొత్స పేర్కొన్నారు. మొదటి రోజే మృతుడి తల్లి, భార్య స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే.. ఈపాటికి ఎమ్మెల్సీ అరెస్టు అయ్యే వారిని బొత్స అభిప్రాయపడ్డారు.
రెండు రోజులపాటు మృతుడి కుటుంబ సభ్యులు సమయం వృధా చేశారని.. ఈ ప్రభుత్వంలో ఎవరూ చట్టానికి చుట్టాలు ఉండరని.. న్యాయం ప్రకారం చర్యలు ఉంటాయని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు బొత్స శ్రీకాకుళంలో సోమవారం మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా బొత్స చంద్రబాబు, లోకేష్ లపై మండిపడ్డారు. లోకేష్ కి తెలిసింది తక్కువ మాట్లాడేది తక్కువ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటలు చెబుతున్నాడు కానీ ఆ అబ్బాయికి ఏమీ తెలియదు అన్నారు. ముగ్గు, సుత్తి, కొడవలి ఇస్తే.. బీసీలను అక్కున చేర్చుకున్నట్లా..? అని ప్రశ్నించారు. బీసీలకు ఇది చేశామని ఒక్కటైనా చెప్పగలరా.. అంటూ లోకేష్, చంద్రబాబును విమర్శించారు. బీసీలను మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు ప్రజల ముందుకు వస్తున్నారని బొత్స పేర్కొన్నారు.