ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి బాగుంటే.. కనుక ఇంతమందితో గొడవ ఎందుకు పెట్టుకుంటామని ఆయన వెల్లడించారు. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్లే ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చలేకపోతున్నామని చెప్పారు.
ఉద్యోగ సంఘాల నేతలతో.. గత రాత్రి చర్చలు జరుగుతున్న సమయంలో.. ఫోన్ మాట్లాడేందుకు బయటకు వచ్చిన నాని ఈ వ్యాఖ్యలు చేశారు. బయటకు వచ్చిన మంత్రిని కొందరు మహిళా ఉద్యోగులు.. ఐఆర్ 27 శాతం ఇచ్చి… ఫిట్ మెంట్ 23 శాతానికి తగ్గించటం ఏంటని ప్రశ్నించారు. ఎప్పటి నుంచో ఉన్న హెచ్‌ఆర్‌ఏ ను ఇప్పుడు తగ్గించడం ఏంటని నిలదీశారు.
అయితే.. దీనికి మంత్రి పేర్ని నాని బదులిచ్చారు. పదో తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే.. స్కూటర్ కొని ఇస్తానని హామీ ఇచ్చిన తండ్రి.. ఆ సమయానికి దివాలా తీస్తే.. పరిస్థితి ఏంటని ఎదురు ప్రశ్నించారు. స్కూటర్ కొనిస్తానని కూడా ఇవ్వలేదని.. ఆ కొడుకు తిట్లుకుంటే అతడు ఏం చేయగలడని.. ప్రస్తుతం ప్రభుత్వ పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు.