నెల్లూరు, సంగం బ్యారేజ్ లను త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి అంబటి రాం బాబు ప్రకటన చేశారు. ఇవాళ నెల్లూరు బ్యారేజ్ పనులను పరిశీలించారు మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబులు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా నెల్లూరు, సంగం బ్యారేజ్ లను ప్రారంభిస్తామని.. పెన్నా డెల్టా ఆధునికీకరణకు ఈ బ్యారేజ్ లు ఎంతో కీలకమని పేర్కొన్నారు.
వరదలు వచ్చినపుడు నగరంలోకి వరద నీరు రాకుండా ఈ బ్యారేజ్ లు ఉపయోగపడతాయని.. జిల్లాలోని ఇర్రిగేషన్ ప్రొజెక్జ్ ల ను సమీక్షించి రైతులకు పూర్తి స్థాయి లో సాగు నీరు అందిస్తామని వెల్లడించారు. నెల్లూరు బ్యారేజ్ కు వై ఎస్.ఆర్. శంకుస్థాపన చేశారన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.
ఆయన మరణం తర్వాత పనులు అసగిపోయాయని… 30 శాతం పనులు చేసి టిడిపి నేతలు గొప్పలు చెప్పుకున్నారని వెల్లడించారు. ఇప్పుడు 90 శాతం పనులయ్యాయి.. త్వరలోనే పూర్తి చేస్తామన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. కోవిడ్ వల్ల పనుల్లో జాప్యం జరిగింది… నెల్లూరు జిల్లా రైతులకు తలమానికమైన సంగం..నెల్లూరు బ్యారేజ్ లు పూర్తి చేస్తామని వెల్లడించారు.