ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కీలక ఆరోపణలు చేశారు టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఒక దళిత యువకుడిని హత్య చేసిన వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబును కాపాడుతున్న ముఖ్యమంత్రి జగన్ తొలి ముద్దాయి అన్నారు. అనంత బాబు బయటకి వస్తే దళిత యువకుడి కుటుంబానికి ప్రాణహాని ఉందని అన్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి సిగ్గుతో తరలించుకోవాలన్నారు గోరంట్ల.
ఏడు రోజులలో ఉరిశిక్ష వేస్తామని దుర్మార్గుడు జగన్ దిశ చట్టం తీసుకువచ్చాడని.. ఇప్పుడు ఆ చట్టం ఎక్కడైనా అమలు అవుతుందా? అని ప్రశ్నించారు. అటు రాజమండ్రిలో వైసీపీ నేతరా అవినీతి పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు. ప్రజలు వద్దని చెప్పినప్పటికీ ఎంపీ మార్గాన భరత్ కలెక్టర్ సారధ్యంలో ఇసుక ర్యాంపులు తెరుస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో అవినీతి తారాస్థాయికి చేరినప్పటికీ కలెక్టర్ స్పందించడం లేదన్నారు గోరంట్ల బుచ్చయ్య.