వైసీపీ ఎమ్మెల్యేని పొగిడిన టిడిపి ఎంపీ కేశినేని

-

ఎన్టీఆర్ జిల్లా: నేడు నందిగామలో స్థానిక ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ఎంపీ కేశినేని నాని. ఈ సందర్భంగా సొంత పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేను పొగుడుతూ మాట్లాడారు కేశినేని నాని. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.

ఎమ్మెల్యే జగన్మోహన్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం పని చేస్తున్నారని కితాబు ఇచ్చారు. రాజకీయం అనేది ఎలక్షన్ వరకే పరిమితం అవ్వాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలలో పనిచేసిన టిడిపి, వైసీపీ నాయకులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు మాట్లాడుతూ.. సమకాలీన రాజకీయాలలో ప్రజాసేవ చేస్తే ప్రజలు ఎప్పుడు గుర్తుంచుకుంటారు అనేదానికి నిలువెత్తు నిదర్శనం కేశినేని నాని అని చెప్పారు.

టాటా ట్రస్ట్ ద్వారా కేశినేని నాని ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా కేశినేని నాని అడుగులు వేస్తున్నారని.. మేము కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news