ఎమ్మెల్సీ అనంత బాబుకు రిమాండ్ పొడగింపు

తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ఉరఫ్ అనంత బాబుకు రిమాండ్ పొడిగిస్తూ శుక్రవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అనంత బాబుకు రాజమహేంద్రవరం కోర్టు మరోసారి రిమాండ్ ను పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్ గడువు శుక్రవారంతో పూర్తి కావడంతో పోలీసులు ఆయనని రాజమహేంద్రవరంలోని ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కోర్టులో ప్రవేశపెట్టారు.

దీంతో అనంతబాబు రిమాండ్ ను అక్టోబర్ 7 వరకు పొడగించడంతో ఆయనను పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా ఎమ్మెల్సీ అనంత బాబుకు బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో ఎన్నిసార్లు పిటిషన్లు దాకలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. అనంత బాబుకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉండడంతో ఆయన చుట్టూ ఉచ్చు బిగించుకుంది. తాజాగా పొడగించిన రిమాండ్ తో మరో 14 రోజులపాటు అనంతబాబు జైలులోనే ఉండనున్నారు.