“ఎన్డీయేలో వైసీపీ”పై బీజేపీ ఎమ్మెల్సీ క్లారిటీ ఇచ్చారు!

-

పదిరోజుల వ్యవధిలో అటు అమిత్ షా ని ఇటు ప్రధాని మోడీని జగన్ కలవడం, మీటింగులు పెట్టుకోవడంతో… హస్తినతోపాటు ఏపీలో రాజకీయ ఊహాగాణాలు పెరిగిపోతున్నాయి! బీజేపీ తో వైకాప కలుస్తుందని.. ఎన్డీయేలో భాగస్వామిగా చేరబోతుందని కథనాలు వస్తూనే ఉన్నయి! అయితే ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్!

అవును… గత రెండు రోజులుగా మీడియాలో తీవ్రంగా ప్రచారంలో ఉన్న అంశం… ఎన్డీయేలో వైసీపీ అని! అయితే ఈ విషయాలపై వైకాపా నుంచి ఇప్పటివరకూ అధికారికంగా ఇంకా క్లారిటీ రాలేదు! అయితే.. జాతీయ స్థాయిలో చక్రం తిప్పే పార్టీలకు కచ్చితంగా బలమైన రీజనల్ పార్టీల మద్దతు అవసరం ఉంటుంది! అయితే… రెండు సార్లు వరుసగా గెలిచారనే గర్వమో లేక నమ్మకమో.. అదీగాక అతి విశ్వాసమో తెలియదు కానీ… వైకాపాతో కలిసే ప్రసక్తి లేదని చెబుతున్నారు మాధవ్!

తమ దృష్టిలో టీడీపీ – వైకాపాలు రెండూ ప్రత్యర్ధులేనని.. ఒక్క జనసేనతో ఏపీలో తమ కలయిక ఉంటుందని చెప్పుకొస్తున్నారు! ఎన్డీయేలో వైసీపీ చేరడం అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని.. ప్రధానిని ముఖ్యమంత్రి కలవడం సర్వ సాధరణ విషయంగా చూడాలని.. తెగేసి చెబుతున్నారు మాధవ్! మరి ఈ విషయాలు హస్తిన పెద్దల అనుమతితోనే చెప్పారా లేక సొంత మాటలా అన్నది తెలియాల్సి ఉంది!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news