దేశంలోనే గంజాయి సరఫరా లో ఏపీ మొదటి స్థానంలో ఉందని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో తెలిపిన విషయం తెలిసిందే. 2021 కి చెందిన నివేదికను ఎన్సీబీ విడుదల చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా ఏడు లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు నివేదికలో ఎన్సీబీ తెలిపింది. ఇందులో ఏపీ నుంచి 26% గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
అయితే ఈ విషయంపై తాజాగా వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందిస్తూ.. గంజాయి సరఫరాను కూడా నియంత్రించలేని వారికి పదవి అవసరమా? అని ప్రశ్నించారు. దేశంలో గంజాయి ఎక్కడ దొరికిన ఏపీ నుంచే వచ్చిందని అంటున్నారని.. తమ వైసిపి పార్టీ వాళ్ళే గంజాయి వ్యాపారం చేస్తున్నారని చెప్పుకుంటున్నారని అన్నారు. ఈ విషయంలో జగన్ తనను తానే ప్రశ్నించుకోవాలని వ్యాఖ్యానించారు. తనకి ఆరు నెలలపాటు హోంమంత్రి పదవి ఇస్తే తానేంటో చూపిస్తానని.. ఏపీలో గంజాయి అనే మాటే వినపడకుండా చేస్తానని చెప్పారు.