పేదలను గెలిపించడమే నా లక్ష్యం అని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మేదరిమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలో ప్రసంగించారు సీఎం జగన్. నాకు నటించే పొలిటికల్ స్టార్స్ లేరు. సామాన్య ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లు. సిద్ధం అంటే ఓ ప్రజా సముద్రం. నోటాకి వచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీ అటువైపు ఉంది. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందని తెలిపారు సీఎం జగన్.
వాళ్ల వెనుక ప్రజలు లేరు కాబట్టి.. అరడజన్ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. సిద్ధం అంటే.. ప్రజలు చేసే యుద్దం.. ఓ ప్రజా సముద్రం.. ఇప్పటికే ఉత్తరాంధ్ర సిద్ధం, ఉత్తర కోస్తా సిద్దం, రాయలసీమ సిద్ధం. ఈరోజు దక్షిణకోస్తా కూడా సిద్ధం అని చెప్పారు సీఎం జగన్. జరుగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మ, అధర్మానికి జరిగే యుద్ధంలో ప్రజలది శ్రీ కృష్ణుడి పాత్ర.. అర్జునుడి పాత్ర మీ బిడ్డ జగన్ ది. జమ్మి చెట్టుపైన దాచి ఉన్న మీ ఓటు హక్కును ప్రయోగించాల్సిన సమయం వచ్చేసింది.