జనసేన కార్యాలయంలో సత్తెనపల్లి గంగమ్మకు ఆర్ధిక సాయం అందించారు ఆ పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహార్. సత్తెనపల్లి గంగమ్మకు రూ. 5 లక్షల నష్టపరిహరం చెక్ ఇవ్వకుండా మంత్రి అంబటి అడ్డుకున్నారని గతంలో ఆరోరణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికీ నష్టపరిహరం ఇవ్వలేదంటూ జనసేన విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బాధితురాలు గంగమ్మకు జనసేన తరపున ఆర్థిక సాయం చేశారు నాదెండ్ల. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా దారుణాలు, దాడులు పెరిగాయన్నారు.
జనసేన ఏ కార్యక్రమం చేపట్టినా ఆటంకాలు కలిగిస్తున్నారని మండిపడ్డారు. వినాయక చవితి ఉత్సవాల నుంచి పార్టీ సభల వరకూ ఆంక్షలేనన్నారు. గంగమ్మ కుమారుడు సెప్టిక్ ట్యాంకులో పడి ప్రాణాలు కోల్పోయాడని.. మంత్రి అంబటి రాంబాబు బయటకు రాకుండా పంచాయతి చేశారని ఆరోపించారు. సీఎం సహాయ నిధి నుంచి సాయం అందిస్తామని వివాదం కాకుండా జాగ్రత్త పడ్డారని అన్నారు. రూ. 5 లక్షలు మంజూరైతే.. అందులో సగం తమకు ఇవ్వాలని అంబటి హెచ్చరించాడని అన్నారు.