“గంజాయి వద్దు బ్రో“ అంటూ ఏపీ యువతకు నారా లోకేష్ పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. రైతన్నలతో ముఖాముఖి సమావేశం ద్వారా ఎంతో నేర్చుకున్నాను. అన్నదాతల ఆవేదనని అర్థం చేసుకున్నానని నారా లోకేష్ తెలిపారు.
టిడిపి అధికారంలోకి వచ్చాక హంద్రీనీవా మిగిలిన 10శాతం పనులు పూర్తిచేస్తామని, పోలవరం మిగులుజలాలను అందించి రాయలసీమ రైతులకు సాగునీరే గాకుండా ఇంటింటికీ తాగునీరు అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని భరోసా ఇచ్చానన్నారు. టెక్నాలజీ అనుసంధానంతో వ్యవసాయాన్ని లాభసాటి చేస్తామని తెలిపాను. టిడిపి అధికారంలోకి వచ్చి రైతుల మోములో ఆనందం చూసినపుడే తన పాదయాత్ర విజయవంతమైనట్లుగా భావిస్తానని రైతన్నలకి చెప్పాను. అంతిమంగా రైతన్న ముఖంలో ఆనందం చూడటమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని లోకేష్ చెప్పారు.