విజయవాడలో ముంపునకు గురైన బాధితులకు చంద్రబాబు సర్కార్ ఆహారం అందిస్తోంది. ఇందులో భాగంగానే హెలికాప్టర్లు ఏర్పాటు చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వల్ల విజయవాడలో ముంపునకు గురైన పలు ప్రాంతాల్లోని వరద బాధితులకు హెలికాప్టర్ ద్వారా ఆహారము, త్రాగునీరు ఇతర సహాయక కార్యక్రమాలను అందజేస్తోంది ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం.
కేంద్ర బలగాలతోపాటు జిల్లా యంత్రాంగానికి చెందిన పలువురు అధికారులు, సిబ్బంది కూడా ఇందులో పాల్గొన్నారు.
- ప్రకాశం బ్యారేజి వద్ద తగ్గుముఖం పట్టిన వరద
- కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక
- 70 గేట్లు పూర్తిగా ఎత్తిన అధికారులు
- సముద్రంలోకి 9,17,476 క్యూసెక్కుల విడుల
- కాలువలకు 500 క్యూసెక్కుల విడుదల
- ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9,17,976 క్యూసెక్కులు
- బ్యారేజీ నీటిమట్టం 19.7 అడుగులు