ర‌ఘురామ వ్యాఖ్య‌ల వెన‌క కొత్త కుట్ర‌…!

త‌న‌కు కుదిరితే.. అది.. కాక‌పోతే.. ఇది..! అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారట‌.. వైసీపీ అస‌మ్మ‌తి నాయ‌కుడు, న‌ర‌సాపురం ఎంపీ.. రఘురామ‌కృష్ణ‌రాజు. ఆయ‌న వైసీపీలో ఉంటూనే.. వైసీపీ టికెట్‌పై గెలిచి కూడా పార్టీని, సీఎం జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న దూకుడు మ‌రింత పెరిగింది. నేరుగా.. సీఎంను నువ్వు మ‌గాడివైతే.. అంటూ వ్యాఖ్యానించే వ‌ర‌కు వ‌చ్చింది. ఇక‌, ఇటీవ‌ల రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటున్న ఓ వ‌ర్గం నాయ‌కుల మాదిరిగా ర‌ఘు కూడా త‌యార‌య్యార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో చిచ్చు పెట్టేలా రాజుగారు వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని అంటున్నారు. సీఎం జ‌గ‌న్‌పై క్రిస్ట‌య‌న్ అనే ముద్ర వేసేందుకు ర‌ఘురామ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా కొడాలి నానిపై విరుచుకుప‌డిన రాజు.. ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న‌కే అప్ప‌గిస్తూ.. చెయ్యి విరగ్గొడ‌తాం.. త‌ల తీసేస్తాం.. అంటూ వ్యాఖ్య‌లు చేయ‌డం వెనుక‌.. ఓ వ‌ర్గం నేత‌ల‌ను రెచ్చ‌గొట్ట‌డం కింద‌కే వ‌స్తుంద‌ని అంటున్నారు. రాష్ట్రంలో మ‌త విధ్వేషాల‌ను రెచ్చ‌గొట్ట‌డం ద్వారా శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించి.. ప్ర‌భుత్వాన్ని ప‌క్క‌కు త‌ప్పించాల‌నే కుట్ర జ‌రుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఈ క్ర‌మంలోనే ర‌ఘు ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని చెబుతున్నారు. ఇదిలావుంటే, తాను `స‌నాత‌న సేన`‌ను ప్రారంభించాన‌ని చెబుతున్న ర‌ఘురామ రాజు.. ఆర్ ఎస్ ఎస్‌కు చేరువ అవుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. స‌నాత‌న సేన వంటి సంస్థ‌ను స్థాపించి.. రాజు చేసేది ఏమీ లేద‌ని. బీజేపీలో త‌న‌కంటూప్ర‌త్యేక ముద్ర ను వేసుకునేందుకు.. మాత్రమే ఇలా చేస్తున్నాడ‌ని అంటున్నారు. మొత్తానికి ఈ వ్య‌వ‌హారం.. రాజ‌కీయంగా ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది.

ఈ స‌నాత‌న సేన ద్వారా ఆయ‌న చేసేది బీజేపీ ప్ర‌చార‌మేన‌ని అంటున్నారు. అంత‌కుమించి.. చేసే ప‌ని కూడా ఏమీ ఉండ‌ద‌ని అంటున్నారు.  మొత్తానికి రాజు చేస్తున్న కార్య‌క్ర‌మాలు, వ్యాఖ్య‌లు పార్టీపై కుట్ర పూరితంగా ఉన్నాయ‌నే విమ‌ర్శ‌లు జోరుగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్ప‌టికే ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైసీపీ నేత‌లు పార్ల‌మెంటును కోరినా. ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర్య‌లు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. పైగా వై-కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను ఇవ్వ‌డం విశేషం..!!

-Vuyyuru Subhash