తుని. తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన నియోజకవర్గం. ఒకప్పుడు ఇది టీడీపీకి కంచుకోట. వరుసగా యనమల రామకృష్ణుడు ఇక్కడ నుంచి విజయం సాధించి.. రాష్ట్రంలో చక్రం తిప్పారు. అలాంటి నియోజకవ ర్గంలో ఇప్పుడు టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక్కడ పార్టీ తరఫున చక్రం తిప్పేనాయకు లు లేకపోవడం గమనార్హం. యనమల కృష్ణుడు ఉన్నప్పటికీ.. ప్రజలు ఆయన్ను రెండు సార్లుగా తిరస్క రిస్తూనే ఉన్నారు. మొత్తంగా ఇక్కడ యనమల ఫ్యామిలీకి హ్యాట్రిక్ పరాజయాలు ఎదురయ్యాయి.
అదే సమయంలో రెండు సార్లుగా దాడిశెట్టి రాజాను గెలిపిస్తూనే ఉన్నారు. వైసీపీ తరఫు న 2014, 2019 ఎన్నికల్లో రాజా ఇక్కడ నుంచి విజయం సాధించారు. అయితే, రెండు సార్లు ఆయన గెలిచినా.. తొలిసారి అంటే.. పార్టీ అధికారంలో లేదు కాబట్టి.. చంద్రబాబు ప్రభుత్వం విపక్షాన్ని అణిచేసింది కాబట్టి.. తాను ఏమీ చేయలేకపోయారు అనడంలో అర్ధం ఉంది. కానీ, ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఎమ్మెల్యేగా రాజా గెలిచి.. కూడా ఏడాది పూర్తి చేసుకుంది.
ఈ సమయంలో నియోజకవర్గంలో దూకుడు పెంచాల్సిన రాజా.. తన వ్యక్తిగత విషయాలకు మాత్రమే పరిమితమయ్యారనే వాదన బలంగా వినిపిస్తోంది. రెండోసారి కూడా గెలిపించారంటే.. రాజాపై ఇక్కడి ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్ధమవుతుంది. కానీ, ఆయన మాత్రం ప్రజా నాడిని పట్టుకోలేక పోతున్నారనే వాదన ఉంది. నిజానికి వరుస గెలుపుతో తనకు, తన ఫ్యామిలీకి తిరుగులేదని గతంలోనూ యనమల భావించారు. అయి తే, అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వకుండా అప్పట్లో హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. దీంతో ప్రజలు ఆయ నను ఆయన కుటుంబాన్ని కూడా తిరస్కరించారు.
ఈ నేపథ్యంలో రాజాకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఏడాది పూర్తయినా.. ఇక్కడి ప్రధానంగా ఉన్న మత్స్యకారుల సమస్యపరిష్కరించలేక పోయారు. తుని ప్రధాన రహదారి విస్తరణ ప్రతిపాదన దశాబ్దాలుగా ఉండిపోయింది. మరి ఇప్పటికైనా రాజా నిలదొక్కుకోవాలంటే.. పనిచేయాల్సిన అవసరం ఉందని ఇక్కడి ప్రజల నుంచి వినిపిస్తోంది. మరి ఆయన వినిపించుకుంటారో లేదో చూడాలి.