ఏపీలో ఆ ఎమ్మెల్యేకు ముందు నుయ్యి.. వెన‌క గొయ్యే..!

-

ఏపీలో గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఆ పార్టీ తరఫున రాజోలు నుంచి ఏకైక ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాదరావు విజయం సాధించారు. ఆయ‌న ఏపీ అసెంబ్లీలో ఒకే ఒక్కడుగా… సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు. టిడి, వైసిపి కండువాల మధ్యలో జ‌న‌సేన కండువాతో రాపాక స్పెష‌ల్‌ అట్రాక్టివ్ గా కనిపించేవారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, జ‌న‌సేన‌కు షాక్ ఇస్తూ వైసీపీకి దగ్గరైనా రాపాక ఎన్నో విషయాల్లో ఆ పార్టీకి తన మద్దతు ప్రకటిస్తున్నారు. ఇక రాజోలు వైసీపీ ఎమ్మెల్యే గా చలామణి అవుతున్న ఆయనకు ఇప్పుడు వైసిపిలో ఆదరణ కరువైంద‌న్న‌ గుసగుసలు వినిపిస్తున్నాయి.

కొద్ది రోజులుగా రాజోలు నియోజకవర్గంలో రాపాక సీన్ అంతా రివర్స్ అవుతుంది. నియోజకవర్గంలో పనులకోసం ఎమ్మెల్యే అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఎవరు పట్టించుకోని పరిస్థితి. వైసీపీకి దగ్గరైన తొలిరోజుల్లో వైసిపి ఎమ్మెల్యేగా చలామణి అయిన రాపాక‌కు ఆడింది ఆటగా.. పాడింది పాటగా అయ్యింది. అప్పుడు వైసీపీ నేత‌గా, ఆ పార్టీ ఎమ్మెల్యేగా రాజకీయం చేసినా ఇప్పుడు రాపాక‌ పరిస్థితి ఎందుకు ? దిగజారిందా అని ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

నియోజకవర్గంలో వైసీపీ నేతలు అమ్మాజీ, బొంతు రాజేశ్వరరావు వర్గాలుగా చీలిపోయారు. నిన్న మొన్నటి వరకు అమ్మాజీ వర్గం రాపాకకు సపోర్ట్ చేసింది. బొంతు వర్గం ముందు నుంచి అమ్మాజీని వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు అమ్మాజీ వర్గానికి రాపాక‌కు మధ్య చెడిందట. ఇప్పుడు అమ్మాజీ వర్గం కూడా ఎమ్మెల్యే రాపాకను దూరం పెట్టడంతో బొంతు వర్గం కూడా మ‌రింత స్ట్రాంగ్‌గా రాపాక ను టార్గెట్ చేయటం మొదలు పెట్టిందట. అందుకే ఇప్పుడు వైసిపి అధిష్టానం సైతం రాపాక ప్ర‌యార్టీని పూర్తిగా తగ్గించడంతో స్థానికంగా అధికారులు సైతం ఆయన మాట వినడం లేదంటున్నారు.

వైసిపి అధిష్టానం మద్దతు ఇప్పుడు బొంతుకే ఉండ‌డంతో ఇప్పుడు ఆయ‌న‌ వర్గం నియోజకవర్గంలో చక్రం తిప్పుతూ ఉంది. ఏదేమైనా తాను నమ్ముకున్న బలమైన వైసిపి వర్గంతో చేయి ఇవ్వ‌డంతో రాపాక బేల చూపులు చూస్తున్నారు. ఇప్పుడు అటు వైసిపి… ఇటు జనసేన అధిష్టానాలు ఎవ్వ‌రూ రాపాకను నమ్మి పరిస్థితులు లేవు. దీంతో రాపాక పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news