అధిక వడ్డీ ఆశ చూపి.. రూ.50కోట్లకు కుచ్చు టోపీ..!

-

అధిక వడ్డీల ఆశ చూపి, సుమారు రూ.50 కోట్లు టోకరా వేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తమతో తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలని నిందితుని ఇంటివద్ద బాధితులు అందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పది రూపాయల చూపి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్, రాఘవేంద్ర నగర్ కాలనీలోని చుట్టూ ప్రక్కల కాలనీ వాసుల వద్ద సుమారు రూ.50 కోట్లు భాషెట్టి నాగరాజ్ వసూలు చేసారని తెలిపారు. ఒక్కొక్క వ్యక్తి వద్ద సుమారు రూ.5 లక్షల నుండి రూ.20 లక్షల పైన వసూలు చేసినట్లు తెలిపారు. కొందరి నుండి క్రిడిట్ కార్డు తీసుకుని అందులో నుండి డబ్బు చెల్లించుకుని తీరా ఇవ్వాలని అడిగినందుకు మూడు నెలలుగా అందుబాటులో లేడని పేర్కొన్నారు.

మూడు నెలల ముందే మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని మూడు నెలలుగా బాధితుల డబ్బుల సమస్య కొలిక్కి రాకపోవడంతో నాగరాజు ఇంటి ముందు అందోళనకు దిగామని తెలిపారు. నాగరాజు తమకు కనబడకుండా తప్పించుకు తిరుగుతున్నాడని, వెంటనే తమకు ఇవ్వవలసిన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. స్నేహం ముసుగులో.. రఘునాథ్ (బాధితుడు).. స్నేహం ముసుగులో తాను తన భార్యతో కలిసి తనతో రూ. 3 లక్షల నగదు, రూ.7 లక్షలు క్రెడిట్ కార్డు నుండి మొత్తం రూ.10 లక్షలు తీసుకుని 3 నెలలు వడ్డీ చెల్లించాడు. ఇప్పటి వరకు తిరిగి చెల్లించడం లేదు. క్రెడిట్ కార్డు కంపెనీ వాళ్ళు డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని, తనలా కాలనీలో చాలా మంది దగ్గర ఇలానే తీసుకుని తిరిగి ఇవ్వడం లేదు. తెలిసి అందరం కలిసి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. పోలీసులు పట్టించుకోకపోతే ఉప్పల్ ఏసీపీకి ఫిర్యాదు చేసినట్టు బాధితులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news