జగన్ దే తప్పు: జేసీకి ఒక రూలు – బాబుకి ఒక రూలు?

-

జేసీ ప్రభాకర్ రెడ్డి అల అబెయిల్ తెచ్చుకుని ఇంటికి చేరారో లేదో.. 24గంటలు గడిచేలోపే తిరిగి పోలీసులు పట్టుకెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దానికి గల కారణాలు క్లియర్ గా ఉన్నప్పటికీ.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకవైపు కోవిడ్ – 19 రూల్స్ ని పాటించకపోవడమే కాకుండా.. పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం.. వారిపై కులపరంగా నోరు జారడం.. తన వైఖరి ఈ జన్మకు మారదన్నట్లుగా సంకేతాలివ్వడం జరిగింది! ఆ సంగతులేమీ పట్టించుకోని బాబు మాత్రం… అడ్డంగా వాదించడం మొదలుపెట్టారు!

jagan
jagan

జేసీ ప్రభాకర్ రెడ్డి విడుదల సమయంలో జరిగిన అల్లరి అంతా ఇంతా కాదనేది సీమ ప్రజలతో పాటు, పోలీసులు చెబుతున్న మాట. కరోనా అన్న విషయం మరిచి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడ నిర్ణయించుకున్న జేసీ ఫ్యామిలీ మెంబర్స్ పై విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. ఈ క్రమంలో… జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు పట్టుకెళ్లిపోవడం… క‌క్ష సాధింపు చ‌ర్య అని అంటున్నారు చంద్రబాబు!

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అక్రమ అరెస్ట్ జ‌గ‌న్ రాక్షస పాల‌న‌కు నిదర్శనమని.. విడుద‌లైన 24 గంట‌ల్లోపే మళ్లీ అరెస్ట్ చేయ‌డం ముమ్మాటికి క‌క్ష సాధింపు చ‌ర్యేనని.. కొవిడ్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన వారిపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ తీసుకోకపోయినా… జేసీ విషయంలో మాత్రమే తీసుకున్నారని అంటున్నారు! దీంతో జగన్ పై విమర్శలు పెరుగుతున్నాయి!

విశాఖ ఎల్జీపాలిమర్స్ ఘటన బాధితులను పరామర్శిస్తానని చెప్పి ఏపీ ప్రభుత్వం దగ్గర పాస్ తీసుకున్న చంద్రబాబు… తెలంగాణ నుంచి ఏపీ బోర్డర్ లోకి ఎంటరైన సమ్మయంలో చేసిన అరాచకం అంతా ఇంతా కాదని అప్పట్లో విమర్శలు వచ్చాయి! కోవిడ్ నిబంధనలను బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న బాబు పనిగట్టుకుని మరీ ఉల్లంగించారని విమర్శలొచ్చాయి. అయితే… ఆ విషయంలో చంద్రబాబుపై కేసులు పెట్టడం, చర్యలు తీసుకోకపోవడం వంటివి నిజంగా జగన్ సర్కార్ చేసిన తప్పే అనేది ప్రస్తుతం ప్రజల మాటగా ఉంది!

చంద్రబాబుపై జగన్ కు ప్రత్యేక ప్రేమ ఏమిటని… కోవిడ్ నిబంధనలు ఉల్లంగించారని జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చెయ్యడం సబబే కానీ… నాడు చంద్రబాబుని “కోవిడ్ నిబంధనల ఉల్లంఘన” విషయంలో వదిలేడం తప్పని అంటున్నారు! రూల్స్ ఎవరికైనా రూల్సేనని బాబుతో సహా పలువురు గుర్తుచేస్తున్నారు!! మరి జగన్ సర్కార్ ఆ దిశగా ఆలోచిస్తుందా లేక.. ఈ వయసులో బాబుని ఇబ్బందిపెట్టడం ఎందుకని లైట్ తీసుకుంటుందా అనేది వేచి చూడాలి!!

Read more RELATED
Recommended to you

Latest news