కరోనా కట్టడి విషయంలో తెలంగాణ సర్కార్ పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. పైగా ఈ విషయమై హైకోర్టు సైతం ప్రభుత్వాన్ని తప్పుబడుతూనే ఉంది. అయినా ప్రభుత్వం మాత్రం తన తీరు మార్చుకోవట్లేదు అనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అయితే తాజాగా.. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైదరాబాద్‌లోని అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. కరోనాతో జనం చస్తుంటే.. సెక్రటేరియట్‌కి 500 కోట్లు అవసరమా..? అని ప్రశ్నించారు.
అలాగే కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని.. అవసరమైతే దానికోసం దీక్ష చేస్తానని ఆయన అన్నారు. అదేవిధంగా కరోనాతో మరణించిన రోగి మృతదేహాన్ని ప్యాకింగ్ చేసి ఇవ్వడానికి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి సిబ్బంది రూ.30 వేలు తీసుకుంటున్నారని. ప్రభుత్వం ఎలాగూ నాణ్యమైన వైద్యం అందించి పేదలకు బతికే అవకాశం ఇవ్వట్లేదు. కనీసం మృతదేహాన్ని కూడా ప్రభుత్వం ప్యాక్ చేసి ఇవ్వదా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.