ఆన్ లైన్ లో ఆడియో బుక్స్..!

ప్రస్తుత కాలంలో పుస్తకాలు చదవడం చాలా తక్కువగా చూస్తున్నామనే చెప్పుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి యువత ఫోన్లలో బిజీ అయ్యారు. ఎప్పుడు చూసినా ఆన్ లైన్ గేమ్స్, సాంగ్స్, వీడియోలు చూస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే మన పెద్దవాళ్లు అలా కాదు. వాళ్లకు కొంచెం టైం దొరికితే చాలు పుస్తకం పట్టుకుని కూర్చునే వారు. కానీ నేటి యువతరానికి పుస్తకాలు చదవాలంటే పరమ బోర్.. ఇక కరోనా పుణ్యమాని చదువులు కాస్త ఆన్ లైన్ బాట పట్టాయి. స్మార్ట్ ఫోన్లే తరగతి గదులయ్యాయి.

reading-girl
reading-girl

ఈ తరం యువత అభిరుచులకు తగినట్లు ఇటీవల కొన్ని ఆన్ లైన్ స్టోరీ వెబ్ సైట్లు వెలిశాయి. మరికొన్ని సంస్థలు చదవడం కంటే వినడానికి యువత ఎక్కువ ఆసక్తి చూపిస్తారని ‘ఆడియో బుక్స్’ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. పేజీలు తిరగేసే కష్టం లేకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినొచ్చు. ప్రస్తుతం ఈ ఆడియో బుక్స్ కు యువతలో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ ఏడాదిలో పాపులర్ అయిన ఆన్ లైన్ ఆడియో బుక్స్ రిటైలర్స్ గురించి తెలుసుకుందాం.

హూప్లా..
ప్లేస్టోర్ లో హూప్లా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇందులో దాదాపు 90 వేల ఆడియోబుక్స్ అందుబాటులో ఉన్నాయి. మీ స్మార్ట్ ఫోన్ ద్వారా మీరు ఆన్ లైన్ పుస్తకాలను వినొచ్చు.
ఓవర్ డ్రైవ్..
ఆన్ లైన్ పుస్తకాల్లో అత్యంత ప్రాముఖ్యతను సాధించింది. ఈ సంస్థ వెబ్ సైట్ లో దాదాపు లక్షకు పైగా ఆడియో బుక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో పుస్తకాలను డౌన్ లోడ్ చేసుకోవాలని అనుకుంటే డిజిటల్ లైబర్రీ కార్డును తీసుకుని లిబ్బి యాప్ ద్వారా యాక్సెస్ పొందాలి.
లైబ్రివోక్స్..
లైబ్రివోక్స్ ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. ఇందులో ఉచితంగా పుస్తకాలను వినొచ్చు. ప్రపంచవ్యాప్తం ఎన్నో ప్రముఖ సంస్థలు ఈ ఆన్ లైన్ ఆడియోబుక్ లైబ్రరీని తమ వెబ్ సైట్లలో ప్రకటిస్తున్నాయి.

లాయల్ బుక్స్, ప్రాజెక్ట్ గుటెన్ బర్గ్, స్పాటి ఫై, స్టోరీనరీ, ఆడిబుల్, స్ర్కిబ్డ్, స్టోరీ టెల్ వంటి డిజిటల్ ఆడియో లైబ్రరీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్నింటికీ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మరికొన్నింటిని ఉచితంగా చదివేయోచ్చు. మరీ ఆలస్యం ఎందుకు బుక్ వినాలనుకుంటే వీటిని డౌన్ లోడ్ చేసేయండి.. వినేయండి.