టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు రమేష్‌బాబు. గతంలో యలమంచిలి, పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రమేష్‌బాబు. ఇక వైసీపీలో చేరిన ఆయన ఈ రోజు నాకు సుదినమని అన్నారు. మూడు రాజధానులకి వ్యతిరేకంగా ఆయన మమ్మల్ని పోరాటం చేయమనటం నాకు నచ్చలేదని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి కి ప్రజలు 151 సీట్లతో మెజారిటీ ఇచ్చారని, ఆయన పనిచేసుకోవడానికి కొంచెం టైం కూడా ఇవ్వకుండా నీ మందితో విమర్శించడం సిగ్గు చేటని అన్నారు. ఎంతోమంది నాతో పాటు వైసీపీ లో జాయిన్ అవ్వాల్సి ఉంది..కరోనా వల్ల రాలేదని ఆయన అన్నారు. ప్రతి దానికీ కోర్టుకెళ్లి అడ్డంకులు సృష్టించి చంద్రబాబు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ఓడిపోవడానికి ఏ బ్యాచ్ కారణమో వారినే వెనకేసుకుని తిరుగుతున్నావని అన్నారు. నీ కొడుకు నాయకత్వంలో పని చేయటానికి మేము ఎవ్వరం సిద్ధంగా లేమన్న ఆయన, బలవంతంగా మమ్మల్ని నీ కొడుకు కింద పని చేయమని చెప్తే అది అవ్వదని అన్నారు.