మాస్క్ లేక పోతే… విమాన ప్రయాణం లేనట్టే : డీజీసీఏ

-

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆగస్టు 31 వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్​(డీజీసీఏ). ఈ మేరకు ఓ ప్రకటన వెలువరించింది. కరోనా కట్టడిలో భాగంగా మార్చి 23 నుంచి అన్ని అంతర్జాతీయ సర్వీసులు నిలిపివేసింది డీజీసీఏ. ఆ తర్వాత దాన్ని జులై 31 వరకు.. తాజాగా ఆగస్టు 31వరకు పొడిగించింది.

మాస్కు ధ‌రిస్తేనే విమాన ప్రయాణానికి అనుమతి ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తేల్చి చెప్పింది. మాస్క్ ధరించడానికి నిరాకరించిన ఏ ప్రయాణీకుడినైనా విమానయాన సంస్థ నో-ఫ్లై జాబితాలో ఉంచవచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.విమానాలలో ప్రీ-ప్యాక్డ్ భోజనం, పానీయలను అందిస్తారు.అంతర్జాతీయ విమానాలలో ఆహారం లేదా పానీయాలను అందిస్తున్నప్పుడు సింగిల్ యూజ్ డిస్పోజబుల్ ట్రేలు, ప్లేట్లు మాత్రమే వాడాలని తెలిపింది.ప్రస్తుత డీజీసీఏ నిబంధనల ప్రకారం విరుద్ధంగా ప్రవర్తించే ప్రయాణీకులపై చర్యలకు ఎయిర్‌లైన్స్, క్యాబిన్ సబ్బందికి అధికారం ఉందని వెల్లడించారు. ఆహారం ప్రయాణ దూరం బట్టి విమానయాన సంస్థలు అందిస్తాయని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news