పవన్ కళ్యాణ్, అనితా రాజీనామా చేయాల్సిందే !

-

పవన్ కళ్యాణ్, అనితా రాజీనామా చేయాల్సిందే అంటూ ముస్లిం దూదేకుల సంఘం డిమాండ్‌ చేస్తోంది. దీనిపై రాష్ట అధ్యక్షులు ముస్లిం దూదేకుల పొలిటికల్ జెఏసి ,వైసిపి స్టేట్ మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి దస్తగిరి మాట్లాడుతూ.. కడపలో మైనర్ బాలికపై ప్రేమోన్మాది ఘాతుకం కి పవన్ కళ్యాణ్,హోమ్ మంత్రి అనితా నైతిక బాధ్యత వహించి పదవులకు రాజీనామా చెయ్యాలన్నారు. బాధిత కుటుబంకు కోటీ రూపాయలు పరిహారం తో పాటు కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అందించాలని కోరారు.

Pawan Kalyan, Anita should resign

మహిళా హోంమంత్రి, అమ్మాయిల్ని కాపాడతానన్న పవన్ ఎక్కడ అంటూ నిలదీశారు. ఏపీ సేఫ్ హ్యాండ్స్ లో ఉందన్న సాయిధరం తేజ్ ఎక్కడన్న… అంటూ ప్రశ్నించారు. కడప బాలిక కుటుంబానికి న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. నూర్ బాషా సంఘాల్ని ఏకం చేసి పోరాటం చేస్తామని ప్రభుత్వానికి దస్తగిరి హెచ్చరించారు. కూటమి సర్కార్ వచ్చాక మహిళలపై వరుస దాడులపై దస్తగిరి ఆందోళన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news