నేను బిజెపి పార్టీకి అమ్ముడుపోనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇవాళ సత్తనపల్లి లో కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తనను వీకెండ్ పొలిటీషియన్ అంటున్నారని, కానీ తాను ప్రజల కోసం మాత్రమే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు.
ఆంధ్ర రాష్ట్రంలో అర్హులకు పెన్షన్లు అందడం లేదు. కాపు నేతలతో బూతులు తిట్టిస్తున్నారు. అంబటి కాపుల గుండెల్లో కుంపటి అన్నారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. మీరు ఇరిగేషన్ మంత్రా. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదనిచెప్పారు పవన్.
నాకు సినిమాలే ఆధారం.. అంబటిలాగా కాదు. మీరు నోరు పారేసుకుంటే నేను నోటికి పని చెప్తా. రాష్ట్రంలో రౌడీయిజం తగ్గాలి. మీరు తొక్కేస్తే మళ్లీ లేస్తా. బాధ్యత లేకుండా మాట్లాడే వైసీపీ నేతలకు బలంగా సమాధానం అని పేర్కొన్నారు పవన్.