తూర్పుగోదావరి: ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ మళ్లీ ఫుల్ యాక్టివ్ అవుతోంది. రోడ్ల గుంతల సమస్య నుంచి… విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం వరకు.. అన్ని సమస్యలపై జనసేన పార్టీ తీవ్రంగా పోరాటం చేస్తోంది. ఏపీ ప్రజల కష్టాలను తీర్చేందుకు తాము ముందుంటామని చెబుతూ.. ముందుకు సాగుతోంది జనసేన పార్టీ. ఇందులో భాగంగానే.. జనసేన పార్టీ మరో పోరాటానికి సిద్ధం అవుతోంది.
నేటి నుండి మత్స్యకారులకు అండగా జనసేన పార్టీ పాదయాత్ర నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు కాకినాడ రూరల్ మత్స్యకార ప్రాంతాల నుండి పాదయాత్ర ప్రారంభించనున్నారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. మత్స్యకారులకు హక్కులను కాలరాసేలా.. జగన్ సర్కార్ తీసుకువచ్చిన జీవో 217 రద్దు చేయాలంటూ ఉభయగోదావరి జిల్లా ల్లో పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకుంది జనసేన పార్టీ. అంతేకాదు.. ఈనెల 20న నర్సాపురం లో బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు పవన్ కల్యాణ్ కూడా హాజరుకానున్నారు.