ఏలూరు చేరుకున్న పవన్ కళ్యాణ్

-

వారాహి విజయ యాత్ర రెండవ దశ ప్రారంభించేందుకు నేడు సాయంత్రం ఏలూరు నియోజకవర్గానికి చేరుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గత నెల 14న అన్నవరంలో ప్రారంభమై అశేష జనావళి జేజేలు అందుకున్న వారాహి విజయ యాత్ర రెండవ దశ ఏలూరు నుంచి ప్రారంభించడానికి పవన్ కళ్యాణ్ సంకల్పించారు. ఈ నేపథ్యంలోనే నేడు సాయంత్రం ఏలూరుకి చేరుకున్న పవన్ కళ్యాణ్ కి ఆ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.

ఏలూరు బైపాస్ వద్ద ఎస్వీ రంగారావు విగ్రహానికి పూలమాల వేసి పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీగా క్రాంతి కల్యాణ మండపంకి చేరుకున్నారు. అంతకుముందు ఆయన కృష్ణాజిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ వద్దకు రాగా.. అక్కడ జనసేన జిల్లా నాయకుడు చలమశెట్టి రమేష్ పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news