మిషన్-100: పవన్ టార్గెట్ ఫిక్స్..పొత్తులో ట్విస్ట్.?

-

ఇక ఏపీ రాజకీయాల్లో పవన్ కంటిన్యూ కానున్నారు. ఇంతకాలం సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉంటూ..అప్పుడప్పుడు ఏపీకి వచ్చి అక్కడ ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడటం చేస్తున్నారు. దీని వల్ల పవన్‌ని వీకెండ్ నాయకుడు అని వైసీపీ విమర్శలు చేస్తుంది. ఎన్ని విమర్శలు వచ్చిన తన వృత్తి ప్రకారం సినిమాలని వదులుకోలేదు..ఇటు ప్రజల కోసం సమస్యలపై పోరాటం చేస్తున్నారు.

 

అయితే ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ ఇంకా ఫుల్ టైమ్ రాజకీయాల్లో కొనసాగడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే బస్సు యాత్ర చేయడానికి రెడీ అయ్యారు. ఇదే క్రమంలో బస్సుని రెడీ చేసుకుని దానికి వారాహి అని పేరు కూడా పెట్టారు. ఇప్పటికే  ఆ బస్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు తెలంగాణలో ముగిశాయి. అతి త్వరలోనే పవన్ బస్సు యాత్రతో ముందుకు రానున్నారు. ఇంకా షెడ్యూల్ రాలేదు గాని..ఈ జనవరిలోనే బస్సు యాత్ర మొదలుపెడతారని సమాచారం.

 

ఇక 100 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరుగుతుందని తెలుస్తోంది. ఇదే క్రమంలో మిషన్-100 అని టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. అంటే ఈ 100 స్థానాల్లో జనసేన బలపడటమే లక్ష్యం. ఈ స్థానాల్లో అభ్యర్ధులని కూడా ప్రకటించాలని చూస్తున్నట్లు సమాచారం. కాకపోతే పొత్తుల బట్టి అభ్యర్ధులు ఉండే ఛాన్స్ ఉంది. అయితే టీడీపీతో పొత్తు ఉంటే జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయనేది క్లారిటీ లేదు.

ఆ సీట్లు బట్టే అభ్యర్ధుల ఎంపిక కూడా ఉంటుందని సమాచారం. కానీ పొత్తులపై ఇప్పుడే క్లారిటీ వచ్చేలా లేదు..ఎన్నికల సమయంలోనే పొత్తులు ముందుకు రావచ్చు. కాకపోతే తప్పనిసరిగా టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు బీజేపీ కలిసొస్తుందా? లేదా అనేది క్లారిటీ లేదు. మరి చూడాలి పవన్ రాజకీయం ఎలా ఉండనుందో.

Read more RELATED
Recommended to you

Latest news