Breaking : రేషన్‌కార్డు దారులకు శుభవార్త..

-

రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న రూపాయి కిలో బియ్యాన్ని నేటి నుంచి ఉచితంగానే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) లబ్ధిదారులకు రేషన్ ఉచితంగా ఇవ్వనున్నట్లు ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రకటించగా.. రాష్ట్రం కూడా అదే నిర్ణయం తీసుకుంది. NFSAతో పాటు రాష్ట్ర పరిధిలోని మరో 56 లక్షల మంది రేషన్ కార్డుదారులకు ఏడాది పాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. దీనివల్ల 1.46 కోట్ల మంది లబ్దిదారులు ప్రయోజనం పొందనున్నారు.

పంచదార, కందిపప్పులు మాత్రం నగదు కు అందించాలని పేర్కొన్నారు. పైగా ఒక వేలిముద్ర బియ్యానికి వేయాలని, మరొక వేలిముద్ర నగదు సరుకులైన పంచదార, కందిపప్పులకు కార్డుదారులచే వేయించాలని సూచించారు. ఆహార భద్రత చట్ట కిందకు వచ్చే లబ్దిదారులందరికీ ఏడాది పాటు ఉచితంగా ఇవ్వాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఆహారభద్రత చట్టం కిందకు రాని వారికి కూడా ఉచితంగా ఏడాది పాటు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ప్రజలు ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే రేషన్ దుకాణాల నుంచి బియ్యాన్ని అందుకోవచ్చని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news