ఆ తర్వాతే ఎన్నికలు..మంత్రి పేర్ని !

Join Our COmmunity

గుడివాడ కే కన్వెన్షన్ గ్రౌండ్ లో ఎన్టీఆర్ టు వైయస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీల ప్రదర్శనలు ప్రారంభించిన మంత్రి పేర్ని నాని ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే నిమ్మగడ్డ రమేష్ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారన్న ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషనర్ దిగజారుడు రాజకీయాలు చేయడం దారుణం అని అన్నారు.

విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ,ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో దుర్మార్గం అని అయన అన్నారు. దేశంలో రెండో దశ కరోనా స్టెయిన్ అడుగుపెట్టిన దృష్ట్యా, కోటి మందికి వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. చంద్రబాబు విశ్వాసం కోసం నిమ్మగడ్డ రమేష్ మూర్ఖత్వంతో ఎన్నికల నిర్వహణకు పూనుకున్నారని ఆయన అన్నారు.

TOP STORIES

ఫౌ-జి గేమ్‌కు భారీ స్పంద‌న‌.. తొలి రోజు ఎంత మంది డౌన్‌లోడ్ చేసుకున్నారంటే..?

ఎన్‌కోర్ గేమ్స్ డెవ‌ల‌ప్ చేసిన ఫియ‌ర్‌లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ (ఫౌ-జి) గేమ్ గ‌ణ‌తంత్ర దినోత్సవం సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం గేమింగ్ ప్రియుల‌కు అందుబాటులోకి వ‌చ్చిన విష‌యం...
manalokam telugu latest news