గన్నవరంలో జరిగిన ఘటనలకు సంబంధించి టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి తో పాటు 13 మందిని పోలీసులు నిందితులుగా చూపారు. వారిలో పట్టాభి తో పాటు పదిమందిని గన్నవరంలోని అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా, రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే నేడు పట్టాభిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గన్నవరం కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
ఈనెల 20న జరిగిన ఘటనలకు సంబంధించి, నియోజకవర్గంలో సంబంధం లేని పట్టాభి రావడం వెనక కుట్ర కోణం పై అనుమానం ఉందని, ఆయన వచ్చిన తర్వాతే ఘర్షణలు జరిగాయని, పట్టాభి వెనక ఎవరిదైనా ప్రోద్బలం ఉందా? అన్న కోణంలో విచారణ చేయాల్సి ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. మరో కేసులో కూడా పట్టాభి నిందితుడిగా ఉండడంతో కోర్టులో హాజరుపరచాల్సి ఉందని తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కోసం పట్టాభిని ఇంకా విచారించాల్సి ఉందని.. రెండు రోజులపాటు పట్టాభిని కష్టానికి ఇవ్వాలని గన్నవరం పోలీసులు పిటిషన్ లో కోరారు.