టిడిపి అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గన్నవరం పర్యటనకు వెళ్ళిన ఆయన.. ప్రణాళిక ప్రకారమే గన్నవరంలో దాడులు జరిగాయని, వైసీపీ నేతలు టెర్రరిస్టుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దొంగ దెబ్బలు.. దొంగాటలు వద్దని, లగ్నం పెట్టుకుని ఎవరేంటో తేల్చుకుందామంటూ బాబు..వైసీపీకి సవాల్ చేశారు. పోలీసులు లేకుండా వస్తే చూసుకుందామని, వారిని పక్కన పెట్టి ధైర్యం ఉంటే సైకో కూడా రావాలని, పిచ్చి రౌడీ చేష్టలకు భయపడేది లేదని బాబు చెప్పుకొచ్చారు.
ఇటీవల గన్నవరంలో టిడిపి నేత చిన్నా ఇంటిపై ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో టిడిపి నేత పట్టాభి అక్కడకు వచ్చి..టిడిపి నేతలని తీసుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్ళి..వంశీ అనుచరులపై ఫిర్యాదు చేయాలని చూశారు. ఇదే సమయంలో వంశీ అనుచరులు టిడిపి ఆఫీసుపై దాడి చేసి ఫర్నిచర్‌ని ధ్వంసం చేశారు. కారుని తగలబెట్టారు. దీనికి నిరసనగా పట్టాభి..టిడిపి శ్రేణులతో జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. అక్కడకు వచ్చి వంశీ అనుచరులు..టిడిపి శ్రేణులు దాడి చేయడానికి చూశారు..కానీ టిడిపి శ్రేణులు ప్రతిఘటించాయి.
దీంతో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో సిఐ కనకారావు గాయపడ్డారు. దీంతో పోలీసులు టిడిపి నేత పట్టాభిని, ఇతర టిడిపి నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపారు. ఇక టిడిపి శ్రేణులపై మర్డర్ కేసులు పెట్టి..అసలు దాడికి పాల్పడ్డ వైసీపీ వాళ్ళపై తేలిక కేసులు పెట్టారని టిడిపి శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
ఈ ఘటనల నేపథ్యంలో బాబు గన్నవరంకు వెళ్ళి..అక్కడ పార్టీ ఆఫీసుని, టిడిపి నేత చిన్నా ఇంటిని పరిశీలించారు..అలాగే జైలుకెళ్లిన టిడిపి నేతల కుటుంబాలని పరామర్శించారు. ఈ తరుణంలోనే లగ్నం పెట్టుకుని వస్తే ఎవరేంటో తేల్చుకుందామని బాబు వైసీపీకి సవాల్ చేశారు. బాబు సవాల్ పై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.