ప్రీతి సూసైడ్: లవ్ జిహాద్? రాజకీయం లేదా?

-

కాకతీయ మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సీనియర్ విద్యార్ధి సైఫ్ వేధింపులకు పాల్పడటం, వాట్సాప్ గ్రూపుల్లో ప్రీతిని వేదిస్తూ తోటి విద్యార్ధులతో కలిసి పోస్టులు పెట్టడం చేశాడు. దీంతో ఆత్మహత్యయత్నం చేశారు. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రీతి మత్తు ఇంజెక్షన్ తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో ప్రీతికి మెరుగైన వైద్యం కోసం వరంగల్ నుంచి హైదరాబాద్‌ నిమ్స్‌‌ ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో దాదాపు మూడు సార్లు ప్రీతి గుండె ఆగిపోయింది. వెంటనే సీపీఆర్‌ చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా వైద్యులు చేశారు. నిమ్స్‌కు చేరుకున్న అనంతరం ప్రీతికి పూర్తిగా వెంటీలేటర్‌, ఎక్మోపైనే చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం తనంతట తాను ఊపిరి పీల్చుకోగలుగుతుందని వైద్యులు తెలిపారు. అయినా ఎక్మో మీద ఉందని చెప్పుకొచ్చారు.

preethi issue

ఇక ప్రీతి అంశంపై తెలంగాణ బి‌జే‌పి అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు.. ఇది ర్యాగింగ్ మాత్రమే కాదని, 100 శాతం లవ్ జిహాద్ అని, అందుకే ఈ కేసును నిర్వీర్యం చేస్తున్నారని, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ ను కాపాడేందుకే అతనిపై సాధారణ కేసులతో జైలుకు పంపుతున్నారని ఫైర్ అయ్యారు.

ఇదిలా ఉంటే ఈ కేసుపై వరంగల్ సీపీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. ప్రీతిని సైఫ్ వేధించడం నిజమే అని, ప్రీతి ప్రశ్నించడాన్ని సైఫ్ తట్టుకోలేకపోయాడని, ఈ కారణంగానే ప్రీతికి సహకరించవద్దని తన స్నేహితులకు చెప్పాడని, ప్రీతిని సైఫ్ ఉద్దేశపూర్వకంగానే వేధించాడని చెప్పారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రీతి గురించి అవమానకర పోస్టులు పెట్టాడని, గ్రూపులో పోస్టు పెట్టి తనను అవమానపరచవద్దని సైఫ్‌ని ప్రీతి వేడుకుందని, అయినా సైఫ్ వినలేదని చెప్పుకొచ్చారు.

20వ తేదీన సైఫ్ వేధింపుల గురించి ప్రీతి తన తండ్రికి చెప్పిందని, 21న ప్రీతి, సైఫ్‌తో కాలేజీ యాజమాన్యం విచారించిందని, అయినా సైఫ్ తగ్గకపోవడంతో.. మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసిందని,  సేకరించిన ఆధారాల ద్వారా సైఫ్‌ను అరెస్ట్ చేశామని.. దీనిలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని సీపీ స్పష్టం చేశారు. మొత్తానికి ప్రీతి అంశం తెలంగాణలో కలకలం రేపుతోంది. ఓ వైపు బి‌జే‌పి ఏమో లవ్ జిహాద్ అంటుంది..మరోవైపు పోలీసులు ఇందులో రాజకీయ ప్రమేయం లేదని అంటుంది. చూడాలి మరి ప్రీతి అంశం ఏ మలుపు తిరుగుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news