బాబుకి బోసు ఎంత స్పష్టంగా చెప్పారంటే…!

-

జనాలు ఇంకా తాను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఎలా గున్నారో అలానే ఉన్నారని చంద్రబాబు భావిస్తున్నట్లున్నారు! జనాలు అప్ డేట్ అయ్యారు.. ఎవరు మాటల నాయకులు, మరెవరు చేతల నాయకులు అనేది తెలుసుకున్నారు! రాజకీయ అవసరాల కోసం ప్రేమలు, అభిమానాలు చూపించే నాయకులకు.. నిజంగా ప్రజలిచ్చిన పదవిని బాధ్యతగా భావించే నాయకులకూ తేడా తెలుసుకున్నారు! ఈ విషయాలపై చంద్రబాబుకు వీలీనంత క్లారిటీ ఇచ్చారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్!

అధికారంలో ఉన్నంతకాలం కళ్లు బైర్లు కమ్మేసి ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని ఎసీలను చులకనగా మాట్లాడి.. కొండమీద క్షురకులు జీతాలు పెంచాలని అడిగితే తోకలు కత్తిరిస్తానని బీసీలను వెకిలిగా మాట్లాడిన చంద్రబాబుకు ఎస్సీలు, బీసీలు 2019 ఎన్నికల్లో చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో… నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 10% అయినా ఇవ్వని చంద్రబాబు బుద్దిని బయటపెట్టారు సుభాష్ చంద్రబోస్!

ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాల్సింది పార్టీ పదవులు కాదని మొదలుపెట్టిన బోస్… బాబు అధికారంలో ఉండగా ఎప్పుడైనా పేదలైన బీసీలను రాజ్యసభకు పంపిన దాఖలాలు ఉన్నాయా అని సూటిగా ప్రశ్నించారు. కానీ… జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వివిధ నామినేటెట్ పదవులలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు 50% రిజర్వేషన్ ‌లను కల్పించారని గుర్తుచేశారు! బీసీల విషయంలో బాబు పనికిమానిలన కబుర్లకు, జగన్ చేతలకూ ఉన్న టేడాని బోస్ అంత క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశారు!

ఫైనల్ గా… నమ్మినంతా కాలం బీసీలు చంద్రబాబుని అత్యంత గుడ్డిగా నమ్మారని.. ఇక భవిష్యత్తులో నమ్మే పరిస్ధితి లేదని బోస్ ఈ సంద్రభంగా స్పష్టం చేశారు!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news