పోలవరం: గోదావరి డెల్టాకు నీటి మళ్ళింపు నేడే..

-

పోలవరం పనులు ఇంకా పూర్తి కాకుండానే గోదావరి డెల్టాకు నీరందించనున్నారు. ఈ మేరకు 6.6కిలోమీటర్ల గోదావరి ప్రవాహాన్ని డెల్టాకు మళ్ళించనున్నారు. ఈ రోజు ఉదయం 11:30గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అప్పర్ కాపర్ డ్యామ్ ద్వారా గోదావరి జలాల మళ్ళింపు ఉంటుంది. స్పిల్ వే, రివర్స్ స్లూయిజ్ ద్వారా ధవళేశ్వరం చేరి అక్కడ నుండి తూర్పు, పశ్చిమ కాల్వల ద్వారా గోదావరి డెల్టాలోకి నీరు చేరుతుంది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మేఘా సంస్థ ప్రారంభించనుంది.

ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రులు ఆళ్ళ నాని, అనిల్ హాజరు కానున్నారు. మేఘా సంస్థ రంగరాజన్ కూడా పాల్గొంటున్నారు. అతి తక్కువ సమయంలో ఈ నిర్మాణ పనులు పూర్తి చేసిన మేఘా సంస్థ. 11:30గంటలకు అప్రోచ్ ఛానల్ ద్వారా గోదావరి డెల్టాకి నీళ్ళ మళ్ళింపు జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news