అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో జరిగే 24 వ జాతీయ మహా సభలపై చర్చించారు సిపిఐ నేతలు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. సీపీఐ జాతీయ మాహాసభలకు 29 రాష్ట్రాల ప్రతినిధులు, 20 దేశాల నుంచి ప్రత్యేక ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. 14 న ర్యాలీ, బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. సీపీఐ, సిపిఎం జాతీయ నాయకులు, ముఖ్యమంత్రులను ఆహ్వానించామన్నారు. దేశంలో రాజకీయలు ప్రమాద కరంగా మారాయన్నారు రామకృష్ణ. ఈ సమయంలో జరుగుతున్న జాతీయ మాహాసభలు కీలకం కానున్నాయన్నారు.
అలాగే మూడు రాజధానులపై సిపిఐ రామకృష్ణ స్పందిస్తూ.. ఎపి అసెంబ్లీలో మూడు రాజధానులపై చర్చ, మూడు రాజధానులు బిల్ పెట్టినప్పుడు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. 60 రోజుల పాదయాత్రపై విమర్శలు చేస్తున్నారని.. బెంజికార్ల వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధానిగా ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఇతర సమస్యలను పక్కన పెట్టి, అసెంబ్లీని కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్ర చేస్తున్న వాళ్లకు అండగా మేముంటామన్నారు.