ఫ్యాన్స్ మాట: ప్రభాస్ డైలాగ్ ని జగన్ కి అప్లై చేస్తున్నారు!

-

ప్రభుత్వం సహాయ సహకారాలు చేసుకుంటూ పోవాలి.. ప్రతిపక్షాలు బాదితులకు అండగా నిలబడాలి! వారిని పరామర్శించాలి.. ఓదార్చాలి.. మేమున్నామనే భరోసా ఇవ్వాలి. అవసరమైన పక్షంలో ప్రభుత్వం మెడలు వంచి బాధితులకు పరిహారాలు అందించాలి.. అందని పక్షంలో వాటికోసం వారి తరుపున పోరాడాలి! ఇది ఇంతకాలం సామన్యుడికి తెలిసిన రాజకీయం!! అయితే అది గతం.. ఇప్పుడు మారిపోయిందిగా అంటున్నారు ఏపీ వాసులు!

“గడిచిన ఐదేళ్లు ఒక లెక్క… 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఒక లెక్క… వైఎస్సార్ కొడుకొచ్చాడని వాళ్లకు చెప్పు… సామాన్యుడి తరుపున ఒక మనసున్న మనిషి సీఎం అయ్యాడనే విషయాన్ని గుర్తుంచుకోమని వాళ్లకు చెప్పు… సామాన్యుడు కన్నీరు పెడితే కరిగిపోవడం కాదు.. కన్నీరు పెట్టే లోపు స్పందించే వ్యక్తి సీఎం అయ్యాడని వాళ్లకు చెప్పు…” అంటున్నారు “ప్రభాస్ – జగన్” ఫ్యాన్స్!

జగన్ అధికారంలోకి రాకముందువరకూ ఒక లెక్క.. జగన్ సీఎం అయినప్పటినుంచీ మరో లెక్కగా ఏపీ రాజకీయాలు మారిపోయాయి! ఎక్కడ ఏ సమస్య వచ్చినా.. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా.. వెంటనే ప్రభుత్వమే స్పందించేస్తోంది. కనీసం ప్రమాధంలో గాయపడిన, మృతిచెందిన కుటుంబాలకు పరిహారం డిమాండ్ చేసే అవకాశం కూడా ప్రతిపక్షాలకు ఇవ్వడం లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే… అధికారపార్టీ, ప్రభుత్వం అన్ని పనులూ పూర్తిచేసిన తర్వాత… ప్రతిపక్షాలు వారం వర్జ్యం చూసుకుని మరీ బాదితులను పలకరించి, రెండు ఫోటోలు దిగి, నాలుగు బైట్స్ ఇచ్చి “మమ” అనిపిస్తున్నాయి!

నాడు విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన సమయంలో… ప్రతిపక్షాలు నిద్రలేచే లోపు… జగన్ విశాఖలో వాలిపోయారు.. బాధితులకు కోటి రూపాయల పరిహారం ప్రకటించారు.. వారం రోజుల్లో అందేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం ప్రతిపక్షాలు మైకుల ముందుకు వచ్చి.. ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పి ముగించాయి! ఇదే క్రమంలో తాజాగా… విజయవాడ స్వర్ణ ప్యాలస్ లో జరిగిన అగ్నిప్రమాధం విషయంలో కూడా ప్రభుత్వం హుటాహుటిన స్పందించింది.. 50లక్షల రూపాయలు పరిహారం ప్రకటించింది. ఆ ప్రైవేటు ఆసుపత్రిపై కేసు నమోదు చేసింది.. బాధితులకు అండగా నిలిచింది.

అయితే… ఈ విషయాలపై ఇప్పటివరకూ ప్రతిపక్షాలన్నీ దిగ్భ్రాంతిని ప్రకటించాయి తప్ప… బాదితులను, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించే పనికి పూనుకోలేదు! ప్రమాధం జరిగిన అనంతరం కనీసం ప్రమాధ స్థలిని పరిశీలించిన పాపాన పోలేదు! చాలాసేపటి తర్వాత, ఒక పూట గడిచిన అనంతరం… బొండా ఉమ వంటి టీడీపీ నేతలు వచ్చి ప్రమాధంపై సమీక్ష జరిపారు! అనంతరం మైకందుకున్న బోండా ఉమ… ఇది ఘోరమైన దర్ఘటనగా తెలుగుదేశం పార్టీ భావిస్తోందీ అని అన్నారు. చంద్రబాబు తనకు ఫోన్ చేశారని.. బాబుకు తాను అన్ని వివరాలు తెలియజేశానని తెలిపారు!

కన్ ఫాం… జగన్ రాకముందు ఒక లెక్క… జగన్ సీఎం అయ్యాక మరో లెక్క… అనే కామెంట్లు ఈ సందర్భంగా ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి!!

Read more RELATED
Recommended to you

Latest news