BREAKING: మళ్లీ జగన్ తో పని చేయనున్న ప్రశాంత్ కిషోర్?

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో మళ్ళీ ప్రశాంత్ కిషోర్ పనిచేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డితో ప్రశాంత్ కిషోర్ పనిచేయడం జరిగింది. ఆ సమయంలో వైసీపీ పార్టీ అఖండ విజయం నమోదు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కొన్ని అనువార్య కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి అలాగే ప్రశాంత్ కిషోర్ మధ్య… విభేదాలు వచ్చినట్లు సమాచారం.

Prashant Kishore to work with Jagan again

దీంతో 2024 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రశాంత్ కిషోర్ ఇద్దరు విడిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం… తెలుగుదేశం కూటమికి సపోర్ట్ గా ప్రశాంత్ కిషోర్ పనిచేయడం జరిగింది. అయితే కొన్ని చిన్న చిన్న తప్పిదాల కారణంగా వైసిపి పార్టీ ఏపీలో ఓడిపోయింది. అయితే ఓటమి బాధలో ఉన్న వైసీపీ పార్టీకి.. సపోర్ట్ గా నిలిచేందుకు ప్రశాంత్ కిషోర్ నిర్ణయం తీసుకున్నారట. ఇందులో భాగంగానే త్వరలోనే జగన్మోహన్ రెడ్డిని కలిసి.. ఆయన కోసం పనిచేయాలని డిసైడ్ అయ్యారట ప్రశాంత్ కిషోర్. అయితే దీనిపై జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా లేరని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news