జులై 4వ తేదీన ప్రధానమంత్రి మోడీ భీమవరం వస్తున్నారు అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల జీవితాలను ప్రజలకు వివరిస్తామని.. అల్లూరి సీతారామరాజు తరహాలో ఎంతో మంది త్యాగాలను మోడీ వివరిస్తున్నారు… మోడీ భీమవరం సభలో అల్లూరి సీతారామరాజు త్యాగాలు దేశ వ్యాప్తంగా చాటి చెబుతారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు.
అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాలను స్పూర్తి కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని.. జులై 2,3వ తేదీల్లో హైదరాబాదులో బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయని చెప్పారు.
దేశంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదిగేలా కార్యాచరణ ఉంటుంది.. ఏపీలో కూడా బీజేపీ బలోపేతమయ్యే దిశగా కార్యక్రమాలు ఉంటాయన్నారు. మోడీ పర్యటనలో నిరసనగా నల్ల జెండాలు ఎగురేయాలన్న వైసీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు వ్యక్తిగతమా..? వైసీపీ అధిష్టానం నిర్ణయమా..? అని ఫైర్ అయ్యారు. ఇటువంటి ఎమ్మెల్సీలను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం… ధర్మవరం సంఘటనను చాలా సీరియస్సుగా పరిగణిస్తున్నామన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. దీనిపై కేంద్ర హోం మంత్రికి లేఖ రాస్తామని హెచ్చరించారు.