జగన్ కు షాక్… జిపిఎఫ్ డబ్బుల కాజేత పై కేంద్రానికి ఫిర్యాదు !

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు దొంగిలించిందని.. పొరబాటున జరిగితే ఒకేసారి 90 వేల ఖాతాల నుంచి ఎలా డ్రా అవుతాయి..? అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. గత నవంబరులో కూడా ఇలాగే డబ్బులు మాయమాయ్యాయి.. జమ చేసిన డబ్బును మళ్లీ విత్ డ్రా చేయడం అంటే ఉద్యోగులను మోసం చేయడమేనని మండిపడ్డారు.

దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని జగన్ సర్కార్ కు వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. ప్రభుత్వం డే లైట్ రాబరీకి పాల్పడింది… చర్యలు తీసుకోవాల్సిన వారే..‌ చోరీకి పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలి..? పిఆర్సీ‌, హెచ్ఆర్ఎ, అలెవెన్సుల విషయంలో కూడా ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు.

ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన దీని పై స్పందించాలి. సీఎఫ్ఎంఎస్ ద్వారా తప్పు జరిగిందని‌ చెప్పడాన్ని ఖండిస్తున్నాం.. ప్రభుత్వం దుశ్చర్యకు పాల్పడిందని అందరకీ అర్థమైందని చెప్పారు. పంచాయతీలకు చెందిన నిధులు ఇప్పటికే దారి మళ్లించారు… ఇప్పుడు ఉద్యోగుల ఖాతాల నుండి ఉద్దేశపూర్వకంగా డ్రా చేశారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్.

Read more RELATED
Recommended to you

Latest news