సీఎం జగన్ కీలక నిర్ణయం.. పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త చెప్పుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖలో గ్రామపంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

గ్రేడ్-3, గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి కలెక్టర్ల ఆధ్వర్యంలో స్థానిక ఖాళీల మేరకు రిజర్వేషన్, రోస్టర్ పాయింట్ల ప్రకారం సీనియారిటీల జాబితా సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆదేశాలు చేశారు. అనంతరం పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు.