ఏపీలో కార్యక్రమాలు వేరైనా..బీజేపీ-జనసేన పొత్తు ఉంటుంది – పురందేశ్వరి

-

ఏపీలో కార్యక్రమాలు వేరైనా..బీజేపీ-జనసేన పొత్తు ఉంటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి ప్రకటన చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్బావ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జెండా విష్కరించిన పురందేశ్వరి.. మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు విషయంలో వైసీపీ నాయకులకు బీజేపీని తప్పు పట్టే అర్హత లేదని… మిత్ర పక్షంగా పవన్ కళ్యాణ్ మాతో చర్చిస్తే.. మేము కూడా స్పందిస్తామని వెల్లడించారు.

ఏపీలో కార్యక్రమాలు వేరైనా . బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతుందని… ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ప్రజల ఆకాంక్షలను కేంద్ర పెద్దలకు వివరిస్తామన్నారు. రాష్ట్రంలో అధికార దాహంతో చేసే పనులు ఎలా ఉంటున్నాయో చూస్తున్నామని.. సేవ చేయడం కన్నా.. అధికారమే లక్ష్యంతో పని చేస్తున్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిస్థితుల్లో మార్పు కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని.. పెట్రోల్, డీజిల్ ఛార్జీల విషయంలో కేంద్రం తన వంతు బాధ్యతగా ధరలు తగ్గించిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పన్నుల విషయంలో ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు దగ్గుబాటి పురంధేశ్వరి.

Read more RELATED
Recommended to you

Latest news