తెలంగాణ ఏర్పడిన గత ఎడేళ్లలో ఐదు వేలకు పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు నరేంద్ర సింగ్ తోమర్. తెలంగాణ ఏర్పడిన గత ఏడేళ్లలో ఆ రాష్ట్రంలో 5,591 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్ సి ఆర్ బి ) ఇచ్చిన సమాచారం ప్రకారం 2015 లో అత్యధికంగా 1358 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడగా, 2020 లో అతి తక్కువగా 466 మంది అర్ధాంతరంగా తనువు చాలింంచారని అని అన్నారు.
2014లో 898 మంది రైతులు. 2016 లో 632 మంది రైతులు. 2017 లో 846 మంది రైతులు. 2018 లో 900 మంది రైతులు. 2019లో 491 మంది రైతులు, ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం దివాలా లేదా అప్పుల బాధ వ్యవసాయ సంబంధిత సమస్యలు కుటుంబ సమస్యలు లేదా అనారోగ్య సంబంధిత కారణాలు అని కేంద్రమంత్రి అన్నారు.వ్యవసాయం రాష్ట్ర సబ్జెక్ట్ గా ఉన్నందున రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు.కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు మరియు కార్యక్రమాల ద్వారా రైతులను ఆదుకుంటుంది అని కేంద్ర మంత్రి చెప్పారు.