ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయని, విడదీసి పాలించాలనేది ప్రస్తుత తమ పార్టీ అధ్యక్షుడి విధానమని, ఎలాగైనా ప్రజలను రక్షించుకోపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుందన్న భయంతో ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలనివ్వకుండా, ప్రజలు మరింత నష్టపోకుండా ఉండాలనే ఆశయంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఉన్నట్లుగా కనిపిస్తుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. వ్యక్తిగత స్వార్ధంతో ఎవరికి వారే యమునా తీరే అంటారా?, లేదా??… మనం ప్రజా సేవలో ఉన్నామని, ఎవరికి వారి పోరాటం చేయడం ద్వారా సరైన ఫలితం ఇవ్వదని, ప్రాక్టీకల్ గా అలోచించాలని సూచించారు.
తాజాగా రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణ రాజు గారు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… శివుడు భస్మాసురుడికి వరం ఇచ్చినట్లుగా, ఒక్క ఛాన్స్, తండ్రి లేని పిల్లవాణ్ణి, తన బాబాయిని హత్య చేశారు… తనపై కోడి కత్తితో దాడి చేశారని అంటే రాష్ట్ర ప్రజలు జగన్ మోహన్ రెడ్డి గారికి వరం ఇచ్చారు. వరం పొందిన భస్మాసురుడు శివుడిపైనే ఆ వరాన్ని ప్రయోగించే ప్రయత్నం చేసినట్లుగా, జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలపై చెత్త పన్నును వేసి, ఆస్తి పన్ను, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి, మన భూమిలో ఆయన బొమ్మలను వేస్తున్నారని అన్నారు. వరం ఇచ్చిన శివుడికి భస్మాసురుడు అనే రాక్షసుడిని అంతమొందించడానికి శక్తి చాలదనట్లుగా, విష్ణుమూర్తిని ఆశ్రయించాడని, శివుడు, విష్ణుమూర్తి కలిసి భస్మాసురుడి నెత్తినే వాడి చే య్యిని వాడి చేత పెట్టించినట్లుగా వరం ఇచ్చిన ఓటరు దేవుళ్ళు కూడా తెలియక వరం ఇచ్చాం… బ్రహ్మ రాక్షసుడిని కొట్టాలంటే ఒక్కరి బలం సరిపోదు, విష్ణుమూర్తి అవతారం ఎత్తినట్లుగానే అన్ని పార్టీలు కలవా లని కోరుకుంటున్నారని అన్నారు. ఒక పార్టీకి బలం ఉంది సైన్యం లేదని, మరొక పార్టీకి సైన్యం ఉందని, ఇప్పుడు ఉన్న బలాన్ని పోలీసులను పెట్టి కొట్టించి, చంపించి, పార్సిల్ చేసి పంపిస్తున్నారని అన్నా రు.