వైద్య రంగంలో పెనుమార్పులు తీసుకువస్తా – మంత్రి విడదల రజిని

-

వైద్య రంగంలో పెనుమార్పులు తీసుకువస్తానని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ప్రకటించారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత 108, 104తో పాటు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలను ప్రభుత్వం విస్తరించిందని.. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల ద్వారా 18,450 మంది తల్లులు, శిశువులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చామని విడదల రజిని వెల్లడించారు.

మెడికల్‌ కాలేజీల ఏర్పాటు, ఆస్పత్రుల ఆధునికీకరణ, అధునాతన వైద్య పరికరాలు.. ఇలా అన్ని విధాలుగా ప్రభుత్వాస్పత్రులను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం బలోపేతం చేస్తోందని వెల్లడించారు. ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించడమే సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఇందుకోసమే దేశంలోనే ఎక్కడా లేని విధంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వైద్య రంగంలో పెనుమార్పులు తీసుకువచ్చిందని చెప్పారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం చేయడానికి రూ.15 వేలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన డాక్టర్‌ బాషాను సస్పెండ్‌ చేశాం. ఈ ఉదంతంపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక అందింది. క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యేవరకు హెడ్‌ క్వార్టర్‌ వదిలివెళ్లొద్దని ఆదేశించామని చెప్పారు విడదల రజిని.

Read more RELATED
Recommended to you

Latest news