వైద్య ఆరోగ్య రంగంలో జ‌గ‌న‌న్న సంచ‌ల‌నం – మంత్రి విడదల రజిని

-

వైద్య ఆరోగ్య రంగంలో జ‌గ‌న‌న్న సంచ‌ల‌నం అని ఏపీ మంత్రి విడదల రజిని అన్నారు. పేద ప్ర‌జ‌ల‌కు మంచి వైద్యం అందించాల‌నే గొప్ప ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని, వైద్యులంతా గొప్ప‌గా సేవ‌లు అందిస్తే.. జ‌గ‌న‌న్న ల‌క్ష్యం నెర‌వేరుతుంద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లు, ప్ర‌భుత్వ టీచింగ్ ఆస్ప‌త్రుల ప‌రిపాల‌నా విభాగానికి చెందిన అధికారుల‌కు విజ‌య‌వాడ‌లో ని ఓ హోట‌ల్‌లో బుధ‌వారం శిక్ష‌ణ కార్యక్ర‌మం ప్రారంభ‌మైంది. రెండు రోజుల‌పాటు జ‌ర‌గ‌నున్న ఈ కార్య‌క్ర‌మానికి తొలి రోజు మంత్రి విడ‌ద‌ల ర‌జిని ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్య‌శ్రీ ప్రొసీజ‌ర్ల పెంపు, ఫ్యామిలీడాక్ట‌ర్ వైద్య విధానం, ఆరోగ్య ఆస‌రా ప‌థ‌కం, ఆరోగ్య ఆస‌రా పింఛ‌న్లు, 104 , 108 వాహ‌నాల పెంపు, 17 మెడిక‌ల్ క‌ళాశాల‌ల నిర్మాణానికి శ్రీకారం… ఇలా వైద్య ఆరోగ్య రంగంలో జ‌గ‌న‌న్న సంచ‌ల‌నాత్మ‌కంగా ప‌నిచేస్తున్నార‌ని మంత్రి వివ‌రించారు. వైద్యులంతా చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తే ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు చేకూరుతుంద‌న్నారు ఏపీ మంత్రి విడదల రజిని.

Read more RELATED
Recommended to you

Latest news