వేసవిలో కాశ్మీర్ వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే ఈ టూర్ ప్యాకేజీ ని మీరు చూడాల్సిందే. ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. మిస్టికల్ కాశ్మీర్ పేరు తో ఫ్లైట్ టూర్ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. మే, జూన్ నెలల్లో అందుబాటులో ఉంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. గుల్మార్గ్, పహల్గామ్, శ్రీనగర్, సోన్‌మార్గ్ వంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. మే 19, 26, జూన్ 9, 16, 23, 30 తేదీల్లో కాశ్మీర్ టూర్ ప్యాకేజీ వుంది. మొదటి రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లో ఈ టూర్ మొదలు అవుతుంది.
మధ్యాహ్నం 1.40 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఫ్లైట్ ఎక్కితే సాయంత్రం 4.40 గంటలకు శ్రీనగర్ రీచ్ అవుతారు. సాయంత్రం దాల్ సరస్సు లో షికారా రైడ్‌కు వెళ్ళవచ్చు. సూర్యాస్తమయాన్ని మీరు చార్ చినార్లో ఎంజాయ్ చేయొచ్చు. రాత్రికి శ్రీనగర్‌లో ఉండాలి. ఇక రెండో రోజు ఉదయం సోన్‌మార్గ్ బయల్దేరాలి. అక్కడ తాజ్‌వాస్ గ్లేసియర్ చూడొచ్చు. సొంత ఖర్చులతో గ్లేసియర్ పాయింట్స్ సైట్ సీయింగ్ ప్లేసెస్ ని చూడచ్చు. మూడో రోజు గుల్‌మార్గ్ టూర్ ఉంటుంది. ట్రెక్కింగ్, గోండోలా పాయింట్ ని కూడా చూడవచ్చు. ఖిలాన్ మార్గ్‌కు ట్రెక్కింగ్ వెళ్ళచ్చు.
నాల్గవ రోజు పహల్గామ్ వెళ్ళాలి. కుంకుమపువ్వు పొలాలు, అవంతిపూర్ శిథిలాలను దారిలో చూడొచ్చు. బేతాబ్ వ్యాలీ, చందన్‌వారీ, అరు వ్యాలీ వంటి ప్రాంతాలు కూడా కవర్ అవుతాయి. మినీ స్విట్జర్లాండ్ కూడా చూడచ్చు. మొఘల్ గార్డెన్స్, చెష్మాషాహి, పరిమహల్, బొటానికల్ గార్డెన్, షాలిమార్ గార్డెన్స్ కూడా ఈ ప్యాకేజీ లో కవర్ అవుతాయి. దాల్ లేక్ ఒడ్డున ఉన్న హజ్రత్‌బల్ క్షేత్రాన్ని కూడా చూడచ్చు. రాత్రికి హౌజ్‌బోట్ లో బస ఉంటుంది. ఆరో రోజు ఉదయం శంకరాచార్య ఆలయ దర్శనం… ఆ తర్వాత కాసేపు షాపింగ్ చేసుకోవచ్చు. సాయంత్రం 5.10 గంటలకు శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ ఎక్కితే రాత్రికి 8.05 గంటలకు హైదరాబాద్ రీచ్ అవుతారు. నలభై వేలు లోపే ఈ ప్యాకేజీ వుంది. పూర్తి వివరాలని అధికారిక వెబ్ సైట్ లో చూడచ్చు.